Transgender : తొలిసారి అమెరికా సెనేట్ కు ట్రాన్స్ జెండర్

Transgender
Transgender : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ ట్రాన్స్ జెండర్ చరిత్ర సృష్టించారు. సెనేట్ కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి అధికారికంగా సెనేట్ లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్ జెండర్ గా రికార్డులకెక్కారు. డిమోక్రటికి పార్టీ తరపున డెలావర్ నుంచి సెనేట్ కు పోటీ చేసిన సారా మెక్ బ్రైడ్ ఈ ఘనత సాధించారు. ఓటర్లు ఆమెకు పట్టం కట్టారు. మంగళవారం పోలింగ్ ముగిశాక చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఆది నుంచి సారా ఆధిక్యం కనబరిచారు. మూడింటి రెండొంతుల మంది ఓటర్లు ఆమెకే ఓటేశారు. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి జాన వాలెన్ 3పై ఆమె సునాయాస విజయాన్ని సాధించారు.