JAISW News Telugu

DSPs-Transfer : ఏపీలో 104 మంది డీఎస్పీలు బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

DSPs-Transfer

DSPs-Transfer

DSPs-Transfer : రాష్ట్రంలో  విధులు నిర్వహిస్తున్న 104 మంది డి.ఎస్పీ లను బదిలీ చేస్తూ రాష్ట్ర  డి.జి.పి  కె.రాజేంద్రనాథ్ రెడ్డి,IPS  ఈరోజు ఉత్తర్వులు జారీ చేసారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో రాష్ట్రంలో అన్ని శాఖలలో ట్రాన్స్ ఫర్ కోనసాగుతున్నాయి. ఇప్పటికే యంఆర్ ఓలను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా  పోలీసు శాఖలో పనిచేస్తున్న డిఎస్పీ లను కూడా ట్రాన్స్ ఫర్ చేస్తూ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పోస్టింగ్ తీసుకున్న వారు వెంటనే చార్జ్ తీసుకోవాలని డిజిపి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ ఫర్స్ అయిన డిఎస్పీల వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలో నుండి బదిలీ అయిన డి.ఎస్పీ ల వివరాలు :
1. శ్రీ కె.శ్రీనివాస మూర్తి – చిత్తూరు ఎస్.డి.ఓ.పి గా పనిచేస్తూ ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి క్రైమ్ డి.ఎస్.పి గా బదిలీ అయ్యారు.
2. శ్రీ వి.శ్రీనివాస రెడ్డి – చిత్తూరు ఎస్.బి డి.ఎస్పీ గా పనిచేస్తూ నాయుడుపేట ఎస్.డి.పి.ఓ గా బదిలీ అయ్యారు.
3. శ్రీ ఎన్. సుధాకర్ రెడ్డి – పలమనేరు ఎస్.డి.ఓ.పి గా పనిచేస్తూ ఆళ్లగడ్డ ఎస్.డి.ఓ.పి గా బదిలీ అయ్యారు.
4. శ్రీ కె.రవి కుమార్ – నగరి ఎస్.డి.ఓ.పి గా పనిచేస్తూ కడప డి.టి.సి డి.ఎస్.పి గా బదిలీ అయ్యారు.
5. శ్రీ జె.బాబు ప్రసాద్ – దిశా డిఎస్పీ గా పనిచేస్తూ కర్నూల్ దిశా డి.ఎస్.పి గా బదిలీ అయ్యారు.

చిత్తూరు జిల్లా కు బదిలీపై వచ్చిన అధికారులు

1. శ్రీ రాజగోపాల్ రెడ్డి – నాయుడుపేట ఎస్.డి.ఓ.పి గా పనిచేస్తూ చిత్తూరు ఎస్.డి.పి.ఓ గా బదిలీ అయ్యారు.
2. శ్రీ బి.శ్రీనాథ్ – భీమవరం ఎస్.డి.ఓ.పి గా పనిచేస్తూ కుప్పం ఎస్.డి.పి.ఓ గా బదిలీ అయ్యారు.
3. శ్రీ ఐ.సుధాకర్ రెడ్డి – కర్నూల్ దిశా డి.ఎస్.పి గా పనిచేస్తూ చిత్తూరు దిశా డి.ఎస్పి గా బదిలీ అయ్యారు.
4. సి.మహేశ్వర రెడ్డి – నంద్యాల ఎస్.డి.ఓ.పి గా పనిచేస్తూ పలమనేరు ఎస్.డి.పి.ఓ గా బదిలీ అయ్యారు.

Exit mobile version