Telecom companies : టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు.. వాటిని అడ్డుకోవాల్సిందే..
Telecom companies : దేశంలోని టెలికాం కంపెనీలకు ట్రాయ్ కొత్త నిబంధనలు విధించింది. ఈ నిబందనలు అక్టబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని అదేశించింది. ఎస్ఎంఎస్ ద్వారా యూఆర్ఎల్, ఓటీపీలు, లింక్‌లు, ఇతర ఏపీకే మెసేజ్ లు పంపడానికి వీలులేదని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇఖ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా పంపే అన్ని రకాల లింక్‌లు వాటంతటవే బ్లాక్ అవుతాయి. ఆన్ లైన్ మోసాల నియంత్రణకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఎస్ఎంఎస్ ద్వారా పంపే యూఆర్ ఎల్, ఓటీపీ లింక్ లు, ఏపీకే లను బ్లాక్ చేయాలని ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలకు ఆగస్టు 20న ఆదేశాలు జారీ చేసింది. వీటి అమలుకు అక్టోబర్ ఒకటో తేదీ వరకు గడువు ఇచ్చింది. మూడు వేలకు పైగా కంపెనీల నుంచి దాదాపు 70వేలకు పైగా లింక్‌లను వైట్‌లిస్ట్ చేశాయి. ఒక కంపెనీ అక్టోబర్ 1 నాటికి దాని లింక్‌ను వైట్‌లిస్ట్ చేయకపోతే, ఆ కంపెనీ ఎస్ఎంఎస్ పూర్తిగా బ్లాక్ అవుతంది.
ఆన్‌లైన్ మోసాలను నివారించేందుకు నిర్ణయం..
అపరిచిత వ్యక్తులు, లేదా సైబర్ మోసగాళ్లు సాధారణ ప్రజలకు ఎస్ ఎంఎస్ లు పంపి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బలు దోచుకుంటున్నారు. వీటిని నియంత్రించడానికి ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా ఏదైనా కంపెనీ ఏదైనా లింక్‌ని ఎస్‌ఎంఎస్‌లో పంపితే, ఆ కంపెనీ బ్లాక్ లిస్టులో చేరిపోతుంది. తెలిపింది. దీనివల్ల ప్రజలకు సైబర్ మోసాల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. దీంతో ప్రజలు తమకు వచ్చే మెసేజ్ లు నిరభ్యంతరంగా ఓపెన్ చేయవచ్చు. ఇ-కామర్స్ కంపెనీలతో హాయిగా కొనుగోళ్లు, విక్రయాలు చేసుకోవచ్చని ట్రాయ్ వెల్లడించింది.