Mallikarjun Kharge : మోదీ సర్కార్ వైఫల్యం వల్లే రైలు ప్రమాదం: ఖర్గే

Mallikarjun Kharge
Mallikarjun Kharge : పశ్చిమ బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రైలు ప్రమాదానికి మోదీ ప్రభుత్వం చేసిన వైఫల్యమే కారణమని ఆరోపించారు. పదేళ్ల పాలనలో రైల్వేశాఖను బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఆ శాఖను ప్రచార వేదికగా మార్చారని, నేడు జరిగిన ఈ ప్రమాదం వాస్తవానికి దర్పణం పడుతోందని అన్నారు. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘‘పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న రైలు ప్రమాదం అనేక మందిని బలితీసుకుంది. పలువురిని తీవ్రంగా గాయపరిచింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఎక్స్ వేదికగా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
కాగా, ఈ రైలు ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.