Executive Producer : టాలీవుడ్ లో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న ఎగ్జిక్యూటీవ్ నిర్మాత
Executive Producer : సినిమా ఒక రంగుల ప్రపంచం. ఎంతో మంది వస్తుంటారు.. కొందరు నిలదొక్కుకుంటే.. మరొకొందరు పడిపోతుంటారు. ఎవరు ఎమవుతారనేది మాత్రం అస్సులు ఊహించలేం. కోట్లాది రూపాయల డబ్బున్న వారు బికారిగా మారచ్చు.. ఏమీ లేదని పేదలు కోటీశ్వరులుగా మారవచ్చు. రంగుల ప్రపంచంలో కనిపించి తాను గొప్పదానిగా కీర్తి దక్కించుకోవాలని కొందరు అనుకుంటారు. కానీ విధి ఏం చేయాలనుకుంటే చివరికి అదే జరుగుతుంది.
సినిమాల్లో రాణించాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ కు వచ్చిన ఓ యువతి సరైన అవకాశాలు లేక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన మాదాపూర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన స్వప్నవర్మ (33) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ గతేడాది నుంచి మాదాపూర్ కావూరి హిల్స్ లోని తీగల హౌస్ 101 ప్లాట్ లో ఒంటరిగా ఉంటోంది. కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తించింది.
అయితే, గత ఆరు నెలలుగా ఎలాంటి ప్రాజెక్టులు లేకుండా ఖాళీగా ఉన్న స్వప్నవర్మ తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో రెండు రోజుల క్రితం తన ప్లాట్ లో ఫ్యానుకు ఉరేసుకొంది. బాడీ డీ కంపోజ్ అవుతూ దుర్వాసన బయటకు రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్వప్నవర్మ సూసైడ్ కు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.