Hathras Tragedy : హత్రాస్ లో విషాదం.. తొక్కిసలాటలో 27 మంది మృతి

Hathras Tragedy
Hathras Tragedy : ఉత్తర్ ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ లో మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారులు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల్లో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
రతీభాన్ పూర్ లో మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియగానే భక్తులు ఒక్కసారిగా గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.