JAISW News Telugu

road accident : విషాదం.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య

road accident : భర్త మృతి చెందారన్న వార్తను తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. నాగరాజు, ఉష దంపతులకు 18నెలల క్రితం పెళ్లి అయింది. వారిద్దరూ విజయవాడ నగరంలోని భాను నగర్ బీఆర్టీఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఉద్యోగరీత్యా నాగరాజు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి ఈరోజు (మంగళవారం) ఉదయం బయలుదేరాడు. ఇంటి నుంచి కొంత దూరం వెళ్లే సరికే వేగంగా వచ్చిన మరో ద్విచక్రవాహనం నాగరాజు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో బైక్ పై ఉన్న వ్యక్తికి సైతం తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదం గురించిన సమాచారాన్ని ఉషకు తెలియజేశారు.

కన్నీటి పర్యంతమైన ఉష వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకొంది. మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చింది. నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. దీంతో ఉష అక్కడ్నుంచి ఇంటికి వెళ్లింది. నాగరాజు లేని జీవితం తనకు వద్దనుకొని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు యువతిని ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో ఇద్దరి వైపు బంధువులు, కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకేరోజు భార్యభర్తలు ఇద్దరు మృతి చెందడంతో విషాదం నెలకొంది.

Exit mobile version