Top Producer : తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ ఇంట్లో విషాదం.. గుండె పోటుతో తల్లి మృతి
Top Producer : ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లో విషాదాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. దక్షిణ భారత్ లోని ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది నటీ నటులను కోల్పోతున్నారు. సినీ నటులే కాకుండా.. సీరియల్స్ లో యాక్ట్ చేసే వారు కూడా మరణిస్తున్నారు. దీంతో ఏమైందో కానీ సినీ రంగానికే చెందిన వారు చనిపోతుండటంతో దిష్టి గానీ సోకిందా అని కొంతమంది హైరానా పడుతున్నారు.
ఈ మధ్యే బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ఆమె మరణం నుంచి కోలుకోకుండానే సహా నటుడు చంద్రకాంత్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్, బొమ్మరిల్లు సినిమాలో నటించిన కమెడియన్ పిచ్చెక్కిస్తా డైలాగ్ తో ఫేమస్ అయిన రాజు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయిన వారే. ఒత్తిడిని జయించలేక ఫైనాన్షియల్ ట్రబుల్ తో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సూర్యదేవర రాధాకృష్ణ గురించి చాలా మందికి తెలుసు. ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన ఇంట్లో విషాదం జరిగింది. సూర్య దేవర రాధాకృష్ణ మాతృమూర్తి చనిపోయారు. దీంతో ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి పేరు నాగేంద్రమ్మ (90) ఏండ్లు. ఆమెకు నలుగురు సంతానం కాగా.. అందులో సూర్య దేవర రాధాకృష్ణ ఒకరు. ఆమె గుండె సంబంధ వ్యాధితో బాధపడుతుండగా.. గురువారం కన్నుమూసింది.
సూర్య దేవర రాధాకృష్ణ గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీకి నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీ శుక్రవారం విడుదల కానుండగా.. ఆయన ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో ఈ ఫిల్మ్ లో నటించిన నటీ నటులు, హిరో విశ్వక్ సేన్, టెక్నిషియన్లు, ఇతర సహ నటులు అందరూ విషాదంలో మునిగిపోయారు. సినిమా రిలీజ్ అయి సక్సెస్ ను ఎంజాయ్ చేద్దామనుకున్న వారందరికీ ఈ చేదు వార్త దు:ఖ సాగరంలో ముంచేసింది.