Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాలో చూపించిన ఊరు ఎక్కడుందో తెలుసా? దాని విశిష్టత ఎంటంటే

Kiran Abbavaram

Kiran Abbavaram

Kiran Abbavaram : తెలుగు సినిమాల్లో ఎప్పుడు కొత్తగా హీరోలు వస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ నిలదొక్కుకుని రాణిస్తూ తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ముందు వరసలో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. క సినిమా ఫ్రీ రిలీజ్ పంక్షన్ లో కిరణ్ మాట్లాడిన మాటలు చూసి చాలా మంది ఎక్కువ మాట్లాడుతున్నారని  అనుకున్నారు. కానీ క సినిమా దీపావళికి విడుదలై ప్రేక్షకులకు మామూలు కిక్కు ఇవ్వలేదు. ఇందులో ఉన్నన్ని ట్విస్టులు ఏ సినిమాలో లేవని సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. సినిమా తీస్తే ఇలా తీయాలి భయ్యా అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సినిమాలో ఒక పల్లెటూరు బ్యాగ్రౌండ్ లో ఉన్న కథను తీసుకుని చూపించారు. ఇందులో ఆ ఊరు ప్రత్యేకంగా ఉంటుంది. నాలుగు కొండల మధ్య ఊరు ఉండి రోజూ మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి అయిపోతుంది. ఈ ఊరుకు సాయంత్రం అన్నదే లేకుండా పోతుంది. ఇలాంటి ఊరులో సాగిన కథను చూపించారు. అయితే సేమ్ సినిమాలో చూపించినట్లే ఈ ఊరు తెలంగాణలో ఉంది.

తెలంగాణలో పెద్దపల్లి జిల్లాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొదురుపాక గ్రామం నాలుగు కొండల మధ్య ఉంటుంది. ఈ ఊరులో మూడు గంటలకే చీకటి అయిపోతుంది. కథ ఈ గ్రామానిది కాకపోయిన డైరెక్టర్ మాత్రం ఈ విలేజ్ ను చూసిన తర్వాతే రాసుకున్నడని అర్థం అయిపోతుంది.

సినిమాలో కథ చాలా డిపెరెంట్ గా ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రోజే కిరణ్ అబ్బవరం చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే కథ అదిరిపోయింది. అంతకుమించి కిరణ్ అబ్బవరం నటన బాగుందనే రివ్యూలు వస్తున్నాయి. మొత్తం మీద ఈ సినిమా  రూ.100 కోట్లు గనక కలెక్షన్ చేస్తే ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరానికి తిరుగు ఉండదని అనుకుంటున్నారు.

TAGS