Tourists : ఈ ప్రదేశాలకు మాత్రం టూరిస్టులు వెళ్లొద్దు.. చాలా డేంజర్..

Tourists

Tourists

Tourists : టూరిస్టు ప్రదేశాలకు వెళ్లడం చాలా మందికి అలవాటు. ప్రతిసారీ ఏదో టూరిస్టు ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటారు. కానీ కొన్ని సార్లు ఆ ప్రాంతం గురించి తెలుసుకోకుండా కొన్ని ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు, డెత్ వ్యాలీలు, నేరాలు జరుగుతుంటాయి. అలాంటి ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది. అవేంటో ఒక్కసారి చూద్దాం.

అమెరికాలోని డెత్ వ్యాలీకి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే అక్కడ వేసవిలో దాదాపు 54 డిగ్రీల ఎండ కొడుతుంది. దీంతో డీహైడ్రేషన్ కు గురవుతారు. చాలా మంది కళ్లు తిరిగి పడిపోతారు. ఒక్కోసారి వేడి తట్టుకోలేక గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్టు శిఖరం. దీన్ని అధిరోహించడానికి అనేక మంది వెళుతుంటారు. వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. మంచు పర్వతాలు, గడ్డ కట్టించే చలి, అనేకమైన ఇబ్బందులకు దారి తీస్తాయి. పైకి వెళ్లే కొద్దీ అక్కడ ఆక్సిజన్ లెవల్స్ పడిపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది. ఇథియోఫియాలో ఉన్న డనాకిల్ డిప్రెషన్ అనే ఏడారి ఇక్కడ వేడిగా ఉన్న అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇవి చాలా భయానకంగా ఉంటాయి. స్నేక్ ల్యాండ్ అత్యంత విషపూరితమైన పాములు ఉండే ప్రదేశం. ఇది బ్రెజిల్ దేశంలో ఉంటుంది. విషపూరితమైన పాముల్లో గోల్డెన్ లార్స్ హెన్స్ అనే పాము అత్యంత ప్రమాదకరమైనది. ఈ దేశంలోని దీవుల్లో ఉంది.

మెక్సికోలోని ఆకాపుల్కో ప్రాంతం. ఈ ప్రదేశం గతంలో ఎంతో మందికి టూరిస్ట్ డెస్టినేషన్. కానీ ఇప్పుడు మారిపోయింది. ఇక్కడ నేరాల రేటు పెరగడంతో ఎక్కువ మంది అక్కడికి వెళ్లడం లేదు. ఈ ప్రాంతంలో ఉండే వారు ఎక్కువగా డ్రగ్స్ కు అలవాటు పడిపోయారు. దీంతో ఇక్కడ నేరాల రేటు పెరిగిపోయింది. టూరిస్టుల సంఖ్య తగ్గిపోయింది. అయితే టూర్స్ కు వెళ్లాలనుకునే వారు ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

TAGS