JAISW News Telugu

Samantha : నా జీవితంలో తీసుకున్న కఠిన, ఉత్తమ నిర్ణయమిదే.. సమంతా షాకింగ్ కామెంట్స్

Samantha

Samantha

Samantha : స్టార్ హీరోయిన్ సమంతాకు ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆమె పెట్టే ప్రతీ పోస్ట్ హార్ట్ టచింగ్ గా ఉంటోంది.  తాజాగా యాక్టింగ్ నుంచి చిన్న విరామం తీసుకోవడంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ మ్యాగజైన్ ఫొటోషూట్ లో పాల్గొన్న సమంతా ఈ విషయంపై మాట్లాడారు..జీవితంలో తీసుకున్న క్లిష్టమైన నిర్ణయం అదేనన్నారు. మయోసైటిస్ నుంచి కోలుకునే క్రమంలో వృత్తిపరమైన జీవితం నుంచి విరామం తీసుకున్నా. ఇప్పటివరకూ తీసుకున్న కఠిన, ఉత్తమమైన నిర్ణయమిదేనన్నారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా వర్క్ కంటిన్యూ వీలుపడలేదన్నారు. పనిపరంగా ఒత్తిడి, ఇతర విషయాలను తట్టుకోవడం అంతా ఈజీ కాదని చెప్పుకొచ్చారు.

దాదాపు 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని, కోపం, ఆత్మన్యూనతకు లోనైన సందర్భాలూ ఉన్నాయని తెలిపారు. వాటన్నంటినీ ఎదుర్కొని మనిషిగా ఎదగాలని శ్రమించానన్నారు. ఈక్రమంలోనే తనలోని అభద్రతా భావాలు తెలిసొచ్చాయని చెప్పారు. ఎదుటి వ్యక్తులతో ఆయా విషయాల గురించి మాట్లాడి.. తనను తను మెరుగుపరుచుకున్నానని తెలిపారు. ట్రోల్స్, విమర్శల మధ్య వ్యత్యాసం గ్రహించగలుగుతున్నానని చెప్పుకొచ్చారు. కష్టసుఖాల్లో తన అభిమానులు తనకు అండగా నిలిచారన్నారు. త్వరలో రాబోతున్న ‘సిటాడెల్’ లో తన పాత్ర తప్పకుండా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పుకొచ్చారు. ఆ పాత్రను తాను ఎంతో ఇష్టపడి చేశానన్నారు.

Exit mobile version