JAISW News Telugu

GT Vs KKR : గుజరాత్ కు చావో రేవో.. కోల్ కతా ఫస్ట్ ప్లేస్ కోసం..

GT Vs KKR

GT Vs KKR

GT Vs KKR : గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్ లు ఆడి ఇప్పటి వరకు 5 మాత్రమే గెలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ 12 మ్యాచుల్లో 9 గెలిచి మూడింటిలో ఓడిపోయింది. సోమవారం సాయంత్రం జరగనున్న కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ మ్యాచ్ లో కోల్ కతా ఫేవరేట్ గా బరిలో దిగుతోంది. అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

గుజరాత్ బ్యాటర్లు శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ గత మ్యాచులో సెంచరీలతో కదం తొక్కగా.. ఈ సీజన్ లో  కోల్ కతా ప్లే ఆప్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ టీం బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో చాలా  పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో హర్షిత్ రాణా 16 వికెట్లు, వరుణ్ చక్రవర్తి (18), నరైన్, అండ్రీ రస్సెల్ 15 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ 12 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో 12 కంటే ఎక్కువ వికెట్లు తీసిన అయిదుగురు బౌలర్లు ఒక్క కోల్ కతాలోనే ఉండటం విశేషం.

ఈ మ్యాచ్ గెలిచి టాప్ వన్ ప్లేస్ లోనే ఉండి డైరెక్ట్ ఫైనల్ ఆడాలని కోల్ కతా భావిస్తోంది. కోల్ కతా బ్యాటర్లు ఫిల్ సాల్ట్, నరైన్ గత మ్యాచులో రాణించకున్నా.. వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా చెలరేగి ఆడటంతో కోల్ కతా మెరుగైన స్కోరు చేసింది. దీంతో ముంబయి పై విజయం సాధించింది. చివరి ఓవర్ లో ఎప్పటిలానే హర్షిత్ రాణా మెరుగ్గా బౌలింగ్ చేసి ముంబయి ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.

గుజరాత్ టీంలో  రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఫామ్ కోల్పోవడం, మోహిత్ శర్మ దారాళంగా పరుగులు ఇవ్వడం ఇబ్బంది పెడుతోంది. డేవిడ్ మిల్లర్, షారూక్ ఖాన్ పూర్తి స్థాయి ఫామ్ అందుకోలేదు. బౌలర్లు, బ్యాటర్లు వారి శక్తికి మించి ఆడితేనే గుజరాత్ టైటాన్స్ నెగ్గుతుంది. ప్లే ఆప్ రేసులో నిలుస్తుంది. ఈ మ్యాచులో ఓడిపోతే అపిషీయల్ గా  ఎలిమినేట్ అవుతుంది.

Exit mobile version