Thotakura Somaraju : తోటకూర వెంకటరాజు అనగానే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ రాజ్ కోటి అనగానే చాలా మంది గుర్తు పడుతుంటారు. రాజ్ 1954 లో జులై 27 న జన్మించాడు. రాజ్ కోటి కలిసి 180 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. తెలుగు లో సూపర్ డూపర్ మ్యూజిక్ అందించి ప్రేక్షకులకు ఉర్రూతలూగించిన కళాకారుడు రాజ్.
హలో బ్రదర్ సినిమా కు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారాన్ని రాజ్ అందుకున్నారు. ఈయన తల్లిదండ్రులు టీవీ రాజు, స్వాతి రాజుకు భార్య ఉష, ముగ్గురు కూతుర్లు దివ్య దీప్తి శ్వేత ఉన్నారు. రాజ్ ప్రళయగర్జన అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హలో బ్రదర్ మూవీలో చేసిన సంగీతం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.
ఆయన సంగీత దర్శకుడిగా పని చేసిన కొన్ని సినిమాలను పరిశీలిస్తే ప్రళయగర్జన ద్వారా తెలుగు కు పరిచయమైన రాజ్ ఆ తర్వాత 180 కి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. భార్యభర్తలు, జేమ్స్ బాండ్ 999, ప్రళయ సింహం, లేడీ జేమ్స్ బాండ్, దిగ్విజయం, ఉక్కు సంకెళ్లు, పున్నమి రాత్రి, శంఖారావం లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, కొదమ సింహం, ముఠా మేస్త్రీ లాంటి పెద్ద సినిమాలకు మ్యూజిక్ అందించి రాజ్ తన ప్రత్యేకత చాటుకున్నాడు.
సిసింద్రీ, మెకానిక్ అల్లుడు, పేకాట పాపారావు, ఏమండీ ఆవిడ వచ్చింది, పెద్దరికం లాంటి జగపతి బాబు, చిరంజీవి, నాగార్జున, రాజేంద్రపసాద్, శోభన్ బాబు, కృష్ణ లాంటి అగ్రహిరోల సినిమాలకు సంగీతం సమకూర్చారు. దీంతో రాజ్ కోటి ద్వయం అంటనే మ్యూజిక్ హిట్ అనేలా టాక్ వచ్చింది. రాజ్ 2023 మే 21 మరణించారు. ఈ రోజు ఆయన వర్థంతి సందర్భంగా ఆయన చేసిన కొన్ని హిట్ సినిమాలు ఇలా గుర్తుచేసుకుందాం.