Rohith Sharma : టాస్‌ కాయిన్‌ జేబులో వేసుకున్నాడు :  రోహిత్‌ ఫన్నీ వీడియో

Rohith Sharma

Rohith Sharma

Rohith Sharma :  భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ సందర్భంగా రోహిత్ తన జేబులో నాణెం మరచిపోయిన వింత సంఘటన కనిపించింది. టాస్ సమయంలో మ్యాచ్ రిఫరీ, రవిశాస్త్రి రోహిత్‌ను నాణెం టాస్ చేయమని కోరుతారు. దీంతో అతను కొన్ని సెకన్లపాటు ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత జేబులోంచి నాణెం తీశాడు. ఇది చూసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం నవ్వు ఆపుకోలేకపోయాడు.

టాస్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షం కారణంగా భారత్-పాక్ మధ్య టాస్ అరగంట ఆలస్యమైంది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మేఘావృతమైన పరిస్థితి ఉందని, తన నలుగురు ఫాస్ట్ బౌలర్లు దానిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారని బాబర్ చెప్పాడు. ప్లేయింగ్-11లో కెప్టెన్ బాబర్ ఒక మార్పు చేశాడు. ఇమాద్ వసీం తిరిగి వచ్చాడు. ఆజం ఖాన్‌ను తొలగించారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టాస్ గెలిచిన తర్వాత మొదట బౌలింగ్ ఎంచుకుంటానని చెప్పాడు.  

టీ-20 ప్రపంచకప్‌లో భారత్ 120 పరుగులు మాత్రమే చేసింది. 121పరుగల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్థాన్‌ను భారత్ కట్టడి చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ల బౌలింగ్‌తో భారత్‌ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. టీ-20 ఇంటర్నేషనల్‌లో భారత్ చేసిన అతి తక్కువ స్కోరు ఇదే కావడం గమనార్హం. పాక్ జట్టు 7 వికెట్లకు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి 2 ఓవర్లలో పాకిస్థాన్ విజయానికి 21 పరుగులు చేయాల్సి ఉంది. జస్ప్రీత్ బుమ్రా 19వ ఓవర్లో వచ్చి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టీమ్ ఇండియా తరపున రిషబ్ పంత్ మాత్రమే 42 పరుగులు చేశాడు. మిగతా ఏ బ్యాట్స్‌మెన్ కూడా 20 మార్కును దాటలేకపోయాడు. జట్టు మొత్తం 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.

TAGS