Raghurama : వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా పనిచేసిన రఘురామకృష్ణంరాజు సీఐడీ కస్టడీలో చిత్రహింసల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కస్టడీలో చిత్రహింసలు పెట్టడం వాస్తవమేనని తేలింది. ఈ మేరకు నాటి సీఐడీ సిబ్బంది వాంగుల్మాలో ముఖ్య విషయాలు వెల్లడించారు. విచారణ అధికారులకు అన్ని వివరాలు వెల్లడించారు.. సీఐడీ కస్టడీలో రఘురామరాజు చిత్రహింసలకు గురైన మాట వాస్తవమేనని అప్పటి సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
అంతేకాదు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రఘురామను కొట్టి అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు చూపించారు. సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌కు రఘురామను చిత్రహింసలు పెట్టిన తీరును వీడియో కాల్‌లో చూపించారని అన్నారు. వీడియో కాల్‌లో చూసిన వెంటనే ముసుగేసుకున్న నలుగురిని తీసుకుని సునీల్ కుమార్ పైకి వచ్చారని తెలిపారు. ఈ మేరకు గుంటూరు పోలీసులు అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు.
అయితే కాల్ కట్ చేసిన తర్వాత కొట్టడమంటే అలా కాదంటూ ముసుగేసుకున్న నలుగురితో కలిచి చీఫ్ లోపలికి వచ్చి కొట్టించారని పేర్కొననారు. రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పారు. ఈ మేరకు గుంటూరు పోలీసులు అప్పటి సీఐడీ సిబ్బంది నుంచి పక్కాగా వాంగ్మూలాలు సేకరించారు. ఇదంతా సునీల్‌కుమార్ సమక్షంలోనే జరిగిందని నిరూపించేందుకు అతని సెల్‌ఫోన్ లొకేషన్‌ను కూడా గూగుల్ టేకౌట్ ద్వారా తీసుకున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూలై 11న ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సీఐడీ పోలీసులు తనపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఇన్వెస్టిగేషన్ అధికారి విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిలను నిందితులుగా చేర్చి, వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని కోరారు.