Vijayawada : విజయవాడలో కుండపోత వర్షం.. జలమయమైన రోడ్లు
Vijayawada Rains : విజయవాడ నగరంలో బుధవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పనులకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారుల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు వీఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు.