Top Heroine : తెరమీద టాప్ హీరోయిన్.. వ్యక్తిగత జీవితంలో ఐరెన్ లెగ్ గా ముద్ర..

Senior Top Heroine leenla chandavarkar

Senior Top Heroine leenla chandavarkar

Top heroine life Sad : తెరమీద స్టార్లు గా వెలుగొందిన నటీనటులు వ్యక్తిగత  జీవితంలో మాత్రం అనేక విషాదాలను మోస్తుంటారు. అలా తెర మీద ఓ టాప్ హీరోయిన్ రాణించినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమెకు ఐరెన్ లెగ్  గా ముద్ర వేశారు. బంధువుల సూటిపోటి మాటలతో బాహ్య ప్రపంచానికే దూరమయ్యారు. ఎవరా స్టార్ హీరోయిన్, ఆమె విషాద గాథలేంటో తెలుసుకుందాం.

లీనా చందావర్కర్ 1970-80లలో టాప్ హీరోయిన్. మొదటి సినిమా రిలీజ్ కాకముందే యావత్ బాలీవుడ్  దృష్టిని ఆకర్షించింది. 1968లో లీనా చందావర్కర్ తన నట జీవితాన్ని  ప్రారంభించింది. ఆ తర్వాత లీనా చందావర్కర్ ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తన గ్లామర్ తో తెరపై అద్భుతాలు చేస్తోంది.  కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో విషాదంతో నిండిపోయింది.

పెళ్లయిన 11 రోజులకే భర్తకు బుల్లెట్ గాయాలు..

లీనా చందావర్కర్ 1975లో గోవా మొదటి ముఖ్యమంత్రి  దయానంద్ బండోద్కర్ కొడుకు సిద్ధార్థ్‌ చందావర్కర్ ను వివాహం చేసుకుంది.అయితే వివాహం జరిగిన 11 రోజులకే  సిద్ధార్థ్‌ చందావర్కర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి.  పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్తుండగా గన్ శుభ్రం చేసుకుంటున్న భర్తకు మిస్ ఫైర్ కావడంతో గాయాలయ్యాయి. ఆరు నెలలకు కోలుకున్నాడు. భర్తను జాగ్రత్తగా చూసుకున్నది లీనా. కానీ  వారి పెళ్లయిన 11 నెలల్లోనే చనిపోయాడు. దీంతో ఆమెపై నిందలు మొదలయ్యాయి.  సిద్ధార్థ్ మరణం తర్వాత లీనా జీవితం ఛిన్నాభిన్నమైంది. తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. ఎక్కడైనా ఆమె ఎదురు పడితే దుశ్శకునమని నిందించేవారంటూ పలు ఇంటర్వ్యూలలో లీనా తనకు జరిగిన అవమానాలను చెప్పుకున్నది.  బంధువులు సైతం అలాగే నిందించేవారని వాపోయింది. తట్టుకోలేక నిద్రమాత్రలు వేసుకొని నిద్రపోయేదానిని తన ఆవేదన వ్యక్తం చేసింది.

బాలీవుడ్ టాప్ హీరోకు నాలుగో భార్యగా..

భర్త చనిపోవడంతో పూర్తిగా ఒంటరైన లీనా జీవితంలోకి బాలీవుడ్ టాప్ హీరో కిషోర్ కుమార్ ప్రవేశించాడు. కిషోర్ కుమార్ అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.  లీనా కుటుంబ సభ్యులు కిషోర్ కుమార్‌తో వివాహానికి అంగీకరించలేదు. కిశోర్ కుమార్ వయసులో లీనా  కంటే 20 ఏళ్లు పెద్ద.  కానీ లీనా తన కుటుంబ సభ్యులను ఎదిరించి 1980లో కిషోర్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయానికి లీనా ఏడు నెలల గర్భవతి.  వీరి దాంపత్యం ఏడు నెలలపాటు కొనసాగింది. భర్త కోసం లీనా నటనకు దూరమైంది. రయితగా మారింది.  కానీ లీనాకు మరోసారి విషాదం ఎదురైంది. 1987లో భర్త కిశోర్ కుమార్ చనిపోయాడు. అప్పటికి లీనా వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే. ఇక అప్పటి నుంచి బాహ్య ప్రపంచానికి మరింత దూరమైంది.

TAGS