Bollywood Actress : భారత్ లోని అన్ని చిత్ర పరిశ్రమల్లో మహిళా యాక్టర్లపై లైంగిక వేధింపుల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సినీ హీరోయిన్ల లైఫ్ అంటేనే వారిని చిన్న చూపు చూడడం సమాజానికి అలవాటైపోయింది. సమాజంతో పాటు అదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా నటీమణులను హీరోయిన్లను క్యారెక్టర్ ఆర్టిస్టులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ ఏడేళ్ల పాటు సర్చ్ చేసి ఇచ్చిన నివేదిక పెను ప్రకంపనలను సృష్టిస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయ్యారు. ఒక బుల్లితెర హీరోయిన్ ని ఒక యూట్యూబర్ డబ్బుల కోసం వేధించినట్టు ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సినీ హీరో రాజ్ తరుణ్ తనను వాడుకొని మోసం చేశాడని లావణ్య అనే మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.
ఇలా రోజుకో ఘటన ఫిల్మ్ ఇండస్ట్రీలలో బయటపడుతూనే ఉంది. మహిళలు ఈ ఇండస్ట్రీలో రాణించాలంటే కాంప్రమైజ్ కావాల్సిందే అని తాజాగా ఓ బాలీవుడ్ నటి వ్యాఖ్యానించింది. బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ లో నటించిన మల్లికా శెరావత్ ఇలాంటి ఘటనలు ఎదుర్కొంది. స్వయంగా ఆమె సోషల్ మీడియాలో మాట్లాడుతూ తాను ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా లేకపోవడానికి కారణం పెద్ద హీరోలతో కాంప్రమైజ్ కాలేకపోవడమే.
తాను సినిమాల్లో బోల్డ్ కంటెంట్ తో నటించానని తన నిజ జీవితంలో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందని అనుకోవడం పొరపాటు అని చెప్పింది. అర్థరాత్రి మూడు గంటలకు హోటల్ రూమ్ కు రమ్మన్నా హీరోలు ఉన్నారని అలాంటి క్యారెక్టర్ తనది కాదని అందుకే తాను స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయానని సంచలన వ్యాఖ్యలు చేసింది. మల్లికా శెరావత్ మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై తన బోల్డ్ కంటెంట్ లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కాగా ఆ సినిమాలో నటించిన తర్వాత తన ఫ్యామిలీకి కూడా దూరమైంది. తాజాగా మల్లికా శెరావత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని కాంప్రమైజ్ కాకపోవడంతోనే సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందని చెప్పింది. విదేశాలకు వెళ్లి ఉంటున్నానని పేర్కొంది.