Pawan Kalyan : ఓవైపు ఐపీఎల్ మేనియా.. మరోవైపు సమ్మర్ మూవీ బొనాంజో.. ఇలాంటి టైంలోనే ఎలక్షన్స్. ఏపీలో అయితే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల టెన్షన్. మరో రెండ్రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు స్టార్ట్ కానున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎరికి వారే స్ట్రాటజీలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నికల ప్రచారంలో పవర్ స్టార్ జనసేన పార్టీ దూసుకెళ్లిపోతుంది. అయితే తెలుగు హీరోల ఫ్యాన్స్ తనకు మద్దతివ్వాలని గతంలోనే పవన్ కల్యాణ్ కోరారు.
అందరు హీరోలతో తనకు మంచి ర్యాపో ఉందని.. ఏ హీరోతో విభేదాల్లోవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జనసేనకు పట్టం కట్టాలని ఏపీ ప్రజలను కోరారు. కానీ, కొందరు హీరోల ఫ్యాన్స్ మాత్రం పవర్ స్టార్ కు షాక్ ఇచ్చారు. రీసెంట్ గా అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్ వైసీపీలో చేరారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి చిన్నియాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభిమానులు మంత్రి అమర్‌నాథ్ నివాసంలో వైసీపీలో చేరారు. మెగా ఫ్యాన్స్ అండ పవన్ కల్యాణ్ కు ఎలాగూ ఉంది. ఓవైపు జగన్ అస్తవ్యస్త పాలన, మరోవైపు జనసేనకు ఎన్డీఏతో పొత్తు.. వెరసి ఈసారి పవన్ హవానే ఉంటుందని అందరూ భావించారు. కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం వైసీపీలో చేరి.. షాక్ ఇచ్చారు.
గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అవన్నీ వట్టి పుకార్లే అని.. మెగా ఫ్యామిలీతో పలు ఈవెంట్లలో పాల్గొని ప్రూఫ్ చేశారు. రెండు ఫ్యామిలీల మధ్య అంతా సెట్ అయ్యిందని అనుకునే లోగా.. జగన్ పార్టీలో చేరి కోలుకోలేని దెబ్బ కొట్టారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇక, బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారారు ప్రభాస్. కనీసం ఆయన ఫ్యాన్స్ మద్దతైనా పవన్ కల్యాణ్ కు దక్కితే బాగుండేది. వాళ్లు సినిమాలకు, పాలిటిక్స్ కు ఏం సంబంధం లేనట్లు జగనన్నకే మద్దతు ఇచ్చారు. దీంతో, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు పవన్ కల్యాణ్.