JAISW News Telugu

Tollywood : టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్… ఆ ఇద్దరిలో ఎవరు ది బెస్ట్ డైరెక్టర్.. సౌత్ లో ఆసక్తికర చర్చలు

Tollywood

Tollywood

Tollywood Vs Kollywood : సౌత్ దర్శకులు ఎప్పటి నుంచో బాలీవుడ్ కు ధీటుగా సినిమాలు తీస్తున్నా ఆ ఉత్సాహాన్ని గత దర్శకులు కొనసాగించలేకపోయారు.  సౌత్ దర్శకుల ఈ నిర్లక్ష్యాన్ని బాలీవుడ్ పెద్దలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ వస్తున్నారు. తెలుగు,తమిళం, మలయాళం, కన్నడలోని సూపర్ హిట్ సినిమాల రీమేక్ హక్కలు తీసుకోవడం అక్కడ భారీ హిట్లు పరిపాటిగా మారింది. అయితే పాత్ ను ముందుగా బ్రేక్ చేసింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. రాజమౌళికి ముందు మణిరత్నం, శంకర్ లాంటి దర్శకులు ఎన్నో సంచలన విజయాలు సాధించినా మళ్లీ ప్రాంతీయానికే పరిమితమయ్యారు.  ఇక రాజమౌళి వేసిన దారిలో అప్ కమింగ్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా స్థాయిలో తమ సినిమాలను మార్కెట్ చేసుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం ఓ ఇద్దరు డైరెక్టర్ల గురించి తీవ్ర చర్చ సాగుతున్నది. అందులో ఒకరు టాలీవుడ్ కు చెందిన నాగ్ అశ్విన్ కాగా, మరొకరు కోలీవుడ్ కు చెందిన కార్తీక్ సుబ్బరాజ్. ఇక నాగ్ అశ్విన్ కల్కి తో సంచలనం సృష్టించాడు. కల్కి-2తో మరిన్ని సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. కల్కికి ముందు నాగ్ అశ్విన్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. అందులో ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం కాగా, రెండోది మహానటి. ఈ రెండు సినిమాలు వేటికవే భిన్నమైనవి. మహానాటితో తనలోని క్రియేటివిటిని చాటుకున్నాడు నాగ్ అశ్విన్. సావిత్రి బయోపిక్ తో  తీసిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పటి పాత్రలు, పరిస్థితులను పున:సృష్టించడం మాములు విషయం కాదు. ఇక కల్కిలో ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించాడు.

కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సత్తా ఉన్న దర్శకుడే.  తమిళంలో స్టార్ డైరెక్టర్ గా చెలామణి అవుతున్నాడు. ఇప్పటి దాకా కార్తీక్ సుబ్బరాజు చేసిన సినిమాలు ప్లాఫ్ కాలేదు.  ఇక అటు నాగ్ అశ్విన్, ఇటు కార్తీక్ సుబ్బరాజు మధ్యలో ఓ చిన్న పోటీ వస్తున్నది. వీరిద్దరిలో ఎవరు బెటర్ అనే ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది.  అయితే ఇద్దరూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లే అయినా రేటింగ్ మాత్రం నాగ్ అశ్విన్ కాస్త ముందున్నాడు. భవిష్యత్ లో వీరు మరెన్ని సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాల్సిందే.

Exit mobile version