Tollywood : టాలీవుడ్ సెన్సేషనల్ హీరోకి అనారోగ్య సమస్యలు

Tollywood

Tollywood Hero sandeep Kishan

Tollywood Hero : చాలామంది సెలబ్రిటీలకు అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎంతో డబ్బు విలాసవంతమైన జీవితం ఏసీ గదుల్లో కూర్చొని హాయిగా గడిపే అవకాశం ఉన్నా కూడా వారిని అనారోగ్యం వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా వారికి ఏదైనా అనారోగ్యం వస్తే బయట ప్రపంచానికి చెప్పుకోవడానికి చాలా మొహమాటపడుతూ ఉంటారు.

అయితే సమంత తన విడాకుల అనంతరం మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు బహిరంగంగా చెప్పేసింది. దీంతో ఆమెకు ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీలోని అనేకమంది పెద్దలు నటులు నటీమణులు అండగా నిలిచారు. అయితే సినిమా ఇండస్ట్రీలో అనేకమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. అనుష్క శర్మ మానసిక ఆందోళనతో, నయనతార స్కిన్ డిజార్డర్ తో దీపిక పదుకొనే డిప్రెషన్ తో ఇలా అనేక మంది హీరోయిన్లు తమకు ఉన్న వ్యాధి గురించి బయటకు చెప్పుకొని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

డబ్బులు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అని ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఈమధ్య హీరో సందీప్ కిషన్ కూడా ఇలాంటి అనారోగ్య సమస్య ఒకటి ఉందని బయట పెట్టాడు. తనకు సైనస్, ఆస్తమా ఉంది అని చెప్పాడు. సందీప్ కిషన్ ప్రస్తుతం తమిళ సూపర్ హీరో ధనుష్ నటిస్తున్న రాయల్ అనే మూవీలో కీలక రోల్ చేస్తున్నాడు.

అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో పొగ లో చేసే ఒక సీన్ కు సంబంధించి తనకు ఊపిరి ఆడలేదని ప్రొడక్షన్ టీం మేనేజ్మెంట్ అంబులెన్స్ తెప్పించడానికి ప్రయత్నం చేశారు. అంత అవసరం లేదని కాసేపు ఫ్రెష్ గాలి పీల్చుకుంటే సరిపోతుందని చెప్పి బయటకు వెళ్లి పోయాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి షూటింగ్లో పాల్గొన్నారు. కానీ అదే షూటింగ్లో పాల్గొన్న కాళిదాస్ అనే వ్యక్తి ఆ పొగ తట్టుకోలేక స్పాట్లోనే పడిపోయాడంట. దీంతో ఎంత డబ్బు ఉన్నా  సెలబ్రిటీలు అయినా ఆరోగ్యం సరిగా లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందేనని సందీప్ కిషన్ విషయంలో మరోసారి రుజువు అయింది.

TAGS