CM Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఓ దుండగుడు చిన్నపాటి రాయి విసిరడం వల్ల గాయం జరిగి ఉండవచ్చు. కానీ అది మీడియాలో హాట్ టాపిక్ గా మారి, త్వరలోనే పార్టీల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. అయితే, విచిత్రమేమిటంటే ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో చాలా యాక్టివ్ గా ఉండే కొందరు సెలబ్రిటీలు మాత్రమే కాదు దాదాపు అందరు తెలుగు హీరోలు, దర్శకులు సైలెంట్ స్టాండ్ తీసుకున్నారు.
లాంఛన ప్రాయమైన ట్వీట్ ద్వారా కూడా ఎవరూ ఈ చర్యను ఖండించడంలేదు. మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నప్పటికీ జగన్ మాత్రం ఏపీ సీఎంగా కొనసాగుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ పట్ల వైఎస్ జగన్ వ్యవహరించినంత తీరుగా ఎవరూ వ్యవహరించలేదరి ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. టికెట్ల పెంపు కోసం ఆయన వారిని అడుక్కోవడంతో టీఎఫ్ఐ పెద్దలంతా చేతులు జోడించి అభ్యర్థించేందుకు జగన్ వద్దకు వెళ్లాల్సి వచ్చింది.
ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ గేమ్ ఆడుతున్నారు. వైసీపీని కానీ, జగన్ ను కానీ ఎలాగోలా డీల్ చేయలేమని మెజారిటీ భావిస్తోంది కాబట్టి ఎన్నికలకు ముందు తన పార్టీకి ఫ్రీ మైలేజ్ ఇవ్వడంలో అర్థం లేదని వారు అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు జగన్ పై రాళ్ల దాడి గురించి ఎలాంటి కామెంట్ చేయడం లేదు. పైగా దాని గురించి కూడా ఆలోచించినా ఎటు నుంచి ఇబ్బంది పడాల్సి వస్తుందని అనుకుంటున్నారని తెలుస్తోంది.