Tollywood : బాలీవుడ్ ను దాటేస్తోన్న టాలీవుడ్.. డామినేషన్ మాములుగా లేదు!

Tollywood

Tollywood Movies

Tollywood : వైజయంతీ మూవీస్ బ్యానర్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సినిమా కల్కి 2898 AD. ఈ సినిమాను అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్నదత్ నిర్మించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక నటించిన కల్కి చిత్రం సుమారుగా 620కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 372కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ రిపోర్ట్.

అయితే ఈసినిమా సుమారుగా 375 షేర్‌తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, రూ. 1000 కోట్ల మైల్ స్టోన్ మార్క్ కు అడుగు దూరంలో నిలిచింది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ నార్త్ సర్క్యూట్స్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో డబుల్ సెంచరీ కొట్టేసింది. 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ సినిమాగా అవతరించింది.  ‘బాహుబలి 2’, RRR తర్వాత హిందీలో రూ.200 కోట్లు వసూలు చేసిన సినిమా ఇదే. ప్రభాస్ కు మాత్రం ఇది రెండో 200 కోట్ల మూవీ కావడం గమనార్హం.

స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ సినిమా రూ.215 కోట్లతో 2024లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన హిందీ చిత్రంగా టాప్ లో నిలిచింది. ఈరోజు ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం దాన్ని క్రాస్ చేసి అగ్ర స్థానానికి చేరుకుంది. ఒక తెలుగు డబ్బింగ్ సినిమా బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. అది కూడా కేవలం 12 రోజుల్లోనే. ఇప్పుడు బాలీవుడ్ మీద టాలీవుడ్ డామినేషన్ నడుస్తోందనే విషయాన్ని ఇది మరోసారి స్పష్టం చేసింది.

నిజానికి ‘బాహుబలి’ సినిమా నుంచే నార్త్ ఆడియన్స్ మన తెలుగు సినిమాలను విశేషంగా ఆదరిస్తున్నారు. ‘బాహుబలి 2’ చిత్రం హిందీలో రూ. 511 కోట్లు కలెక్ట్ చేయగా.. RRR (రూ.274కోట్లు), సలార్ (రూ.170కోట్లు), సాహో (రూ.145కోట్లు), ఆదిపురుష్ (రూ.140కోట్లు), బాహుబలి (రూ.119కోట్లు), పుష్ప-1 (రూ.108కోట్లు) సినిమాలు బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించిన టాప్-10 సౌత్ చిత్రాల జాబితాలో ఉన్నాయి. ‘హనుమాన్’ మూవీ సైతం రూ.58 కోట్లతో ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాస్ హిందీ చిత్రాల లిస్టులో చేరింది. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ హిందీలో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాదిలోనే మరికొన్ని తెలుగు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ లాంటి మరికొన్ని తెలుగు చిత్రాల గురించి హిందీ జనాలు మాట్లాడుకుంటున్నారు.

TAGS