Abhiram Daggubati:వైభవంగా ద‌గ్గుబాటి అభిరామ్ వివాహం

Abhiram Daggubati:ప్ర‌ముఖ నిర్మాత డి. సురేష్‌బాబు త‌న‌యుడు, హీరో ద‌గ్గుబాటి రానా సోద‌రుడు, యంగ్ హీరో ద‌గ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడ‌య్యారు. వ‌రుస‌కు మ‌ర‌ద‌లు అయిన ప్ర‌త్యూష అనే యువ‌తిని వివాహం చేసుకున్నారు. శ్రీ‌లంక‌లో జ‌రిగిన డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు బంధువులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. కొద్ది మంది బంధువులు, స్నేహితుల స‌మ‌క్షంలో వేద మంత్రాల సాక్షిగా అభిరామ్‌, ప్ర‌త్యూష ఒక్క‌ట‌య్యారు.

మూడు రోజుల పాటు శ్రీ‌లంక‌లో ఈ వివాహ వేడును నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌కు శ్రీ‌లంక‌లోని ఓ రెస్టారెంట్ వేదికైంది. శ్రీ‌లంక నుంచి ద‌గ్గుబాటి ఫ్యామిలీ హైద‌రాబాద్ తిరిగొచ్చాక రిసెప్ష‌న్‌ని ఏర్పాటు చేయ‌నున్నట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌లే టాలీవుడ్ హీరో వ‌రుణ్ తేజ్ వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉంటే ద‌గ్గుబాటి అభిరామ్ ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు తేజ రూపొందించిన `అహింస‌` సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. స‌దా కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ 2న విడుద‌లై ఆశించిన ఫ‌లితాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది. ఈ సినిమా త‌రువాత ద‌గ్గుబాటి అభిరామ్ మ‌రో సినిమాని ప్ర‌క‌టించ‌లేదు.

TAGS