టాలీవుడ్ బాక్సాఫీస్.. మిస్సయిన ఒక ముఖ్య విషయం..  

Tollywood ఫ ఈ ట్రెండ్ లో సినిమా అంటే అది పాన్ ఇండియా మాత్రమే. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ ఒక్క పాయింట్ చుట్టే తిరుగుతున్నారు. ప్రతీ సూపర్ స్టార్ పాన్ ఇండియా వైభవాన్ని లక్ష్యంగా పెట్టుకోవడంతో టాలీవుడ్ పూర్తిగా పాన్ ఇండియా ఫీవర్ తో నిండిపోయిందని చెప్పక తప్పదు. దీనికి అనుగుణంగానే ప్రొడక్షన్ బడ్జెట్ ను కూడా భారీగానే పెరుగుతూ వెళ్తోంది. అయితే సినిమాల స్థాయి పెరుగుతున్నా.. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మాత్రం తగ్గుతూ వస్తోంది అదే రీకాల్ వాల్యూ. ఈ మధ్య ట్రెండ్ ను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే గతంలో చూసినంతగా ఒక్క సూపర్ స్టార్ సినిమా కూడా పెద్దగా రీకాల్ వాల్యూతో రావడం లేదు.

ఇటీవల విడుదలైన కల్కి, దేవర, గుంటూరు కారం తదితర చిత్రాలకు పెద్దగా రీకాల్ వాల్యూ లేదు. సలార్ లోని కొన్ని కొన్ని సన్నివేశాలు కొంత రీవాచ్ వాల్యూ కలిగి ఉన్నా మొత్తం చిత్రంను చూస్తే ఇది కూడా పెద్దగా రీవాచ్ పై ఇంట్రస్ట్ ను తగ్గిస్తుంది. పాన్ ఇండియా ఫేమ్, అప్ గ్రేడ్ కోసం వెతుకుతూ టాలీవుడ్ పెద్దలు విలువనిచ్చే బలమైన రచనా శక్తిని కోల్పోయారని స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ వైభవాన్ని, విస్తృత ఆకర్షణను అనుసరిస్తున్నందున, గుర్తుకు వచ్చే రచన ముఖ్యమైన అంశం కనుమరుగైంది.

డిసెంబర్ 5వ తేదీ పుష్ప 2 విడుదల కానుండడంతో ఈ సినిమా ఈ మధ్య వచ్చిన సినిమాలకు భిన్నంగా కాస్త ఊరటనిస్తుందని, కొంత రీకాల్ వాల్యూను కలిగి ఉంటుందని ఆశిస్తున్నారు. కనీసం ఉత్తరాది మార్కెట్లలో అయినా పుష్ప కు ఓటీటీలో క్రేజ్ కనిపిస్తుంది. సుకుమార్ ఈ సారి పుష్ప 2తో మరింత బెటర్ గా వండిపెడతాడని నెటిజన్లు ఆశిస్తున్నారు.

TAGS