Today Horoscope : నేటి రాశి ఫలాలు
Today Horoscope : మేష రాశి వారికి సమయానికి సాయం చేసే వారుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతారాధన చేయడం మంచి లాభాలు కలిగిస్తుంది.
వ్రషభ రాశి వారికి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మంచి ఫలితాలు సాధిస్తారు. చేపట్టే పనుల్లో మేలు కలుగుతుంది. శివారాధన చేయడం ఉత్తమం.
మిథున రాశి వారికి మనో ధైర్యం కోల్పోకుండా ఉండాలి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కోపానికి వెళ్లడం సరికాదు. శివారాధన చేయడం మంచిది.
కర్కాటక రాశి వారికి అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ముఖ్య విషయాల్లో ధైర్యంగా ముందుకెళ్లాలి. ఈశ్వరారాధన శుభకరం.
సింహ రాశి వారికి గొడవలకు వెళ్లొద్దు. శ్రమ పెరుగుతుంది. మంచి నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. విష్ణు సహస్ర నామాలు చదువుకోడం శ్రేయస్కరం.
కన్య రాశి వారికి ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. మొహమాటానికి పోవద్దు. మీ రంగంలో ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది. మహాలక్ష్మీ దర్శనం మేలు కలిగిస్తుంది.
తుల రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికత వైపుఅడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. దత్తాత్రేయ ఆరాధన శుభప్రదం.
వ్రశ్చిక రాశి వారికి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మనోధైర్యంతో మంచి ఫలితాలు సాధిస్తారు. అధికారులు అండగా నిలుస్తారు. ఉమామహేశ్వర స్తోత్రంచదవడం శ్రేయోదాయకం.
ధనస్సు రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం శుభకరం.
మకర రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈశ్వర ధ్యానం చేయడం మేలు చేస్తుంది.
కుంభ రాశి వారికి కొన్ని ఘటనలు వైరాగ్యం కలిగిస్తాయి. కొందరిని నమ్మకండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సూర్య నమస్కారాలు చేయడం మంచిది.
మీన రాశి వారికి పనులు ప్రారంభించడానికి మంచి సమయం. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. లక్ష్మీదేవి దర్శనం శుభ ఫలితాలు కలిగిస్తుంది.