World Earth Day : నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం
World Earth Day : భూమిపై మాత్రమే జీవం మనుగడ సాగించగలదు. అలాంటీ ఈ భూమిని రక్షించుకోవాలనే అవగాహన కల్పించేందుకు 1970 నుంచి ఏప్రిల్ 22ను ‘ఎర్త్ డే’ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాలనేది ఈ ఏడాది థీమ్. దీని ప్రకారం ‘ప్లనెట్ వర్సెస్ ప్లాస్టిక్’ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టికి వాడకాన్ని అంతం చేయడం, దాని ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణపై దృష్టి పెట్టాలి. మనిషి వెళ్లలేని ప్రాంతాల్లో సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు నిండిపోతున్నాయని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
ఎర్త్ డే రోజున కాలుష్యం వల్ల కలిగే ప్రమాదం, అటవీ నిర్మూలన వంటి పర్యావరణ సమస్యల గురించి ప్రజలు చర్చిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల సహాయంతో పర్యావరణం వల్ల కలిగే నష్టాలను ప్రజలు తెలియజేసి భూమిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అవగాహన కల్పిస్తారు.
భూమి మానవలకే కాదు జంతువులకు, మొక్కలకు నిలయం. కానీ మానవులు తమ అవసరాలు తీర్చుకునేందుకు భూమికి అనేక విధాలుగా హాని కలిగిస్తున్నారు. దీంతో వరదలు, కాలుష్యం, వాతావరణ మార్పుల వంటి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా భూమి, ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను అవగాహన ప్రతి ఒక్కరికీ కల్పించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుతున్నారు.