India vs Australia Final Match : నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథులుగా చాలా మంది విచ్చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా, ఉస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్, ఆర్బీ గవర్నర్ శక్తికాంత్ దాస్, అమెరికా రాయబారి ఎరిక్ గస్సెట్టి, అస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మ, భారత్ లోని ఆస్ట్రేలియా రాయబారి ఫిలిప్ గ్రీన్, ప్రముఖ బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు ప్రత్యేకంగా తిలకించనున్నారు. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
గత ఫైనల్ మ్యాచ్ గెలిచిన కెప్టెన్లు కపిల్ దేవ్, ధోని, లాయిడ్ ఆలెన్ బోర్డర్, స్టీ వ్ వా, క్లార్క్, ఇయాన్ మోర్లాన్, పాంటింగ్ లను ఆహ్వానించారు. పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ రాలేకపోతున్నారు. మాజీ కెప్టెన్లందరు ప్రత్యేకమైన బ్లేజర్ ను ధరించే ఏర్పాట్లు చేసింది. ఫైనల్ మ్యాచ్ కు వాయుసేన విన్యాసాలు చేయనుంది. పది నిమిషాల పాటు ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు జరగనున్నాయి.
ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రీతమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత విభావరి ఉంటుంది. ప్రీతమ్, జోనితా గాంధీ, అమిత్ మిశ్రా, నకాష్ అజీజ్, తుషార్ జోషి వంటి సింగర్లు ఇందులో పాల్గొంటున్నారు. 500 మంది డ్యాన్సర్లతో కనువిందు చేయనున్నారు. లేజర్ షోలో ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఆకట్టుకోనుంది.
మ్యాచ్ ముగిసిన తరువాత భారీ బాణసంచా కాల్చనున్నారు. స్టేడియం పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 60 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ కు ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకునేందుకు బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే స్టేడియంలో ఏర్పాట్లు చూస్తుంటే అందరికి కళ్లు చాలవన్నట్లు తెలుస్తోంది.