NTR Jayanti : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి జయంతి నేడే.. సీనియర్ ఎన్టీఆర్ విశేషాలు కొన్ని తెలుసుకుందాం

NTR Jayanti

NTR Jayanti

NTR Jayanti  : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేద ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ జయంతి నేడే. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 1923, మే 28 వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు.

ఎన్టీఆర్ దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, హిందీ, గుజరాతీ మూవీల్లో నటించి మెప్పించారు. పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి తెలుగు భాష గొప్పతనం ఎంటో జాతికి తెలియజేశారు.
రాముడు, కృష్ణుడు అవతారాలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలియజేసిందే ఎన్టీఆర్. 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీని పెట్టారు. పార్టీ ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రభంజనం సృష్టించారు. దాదాపు మూడు దపాలుగా 7 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా చేసి తెలుగు ప్రజల మన్ననలు పొందారు.

ఎన్టీఆర్ పేరును తారకరాముడు అని మేనమామ పెట్టారు. విశ్వనాథ సత్యనారాయణ కాలేజీలో లెక్చరర్ గా ఉన్న సమయంలో ఎన్టీఆర్ స్టూడెంట్ గా చదువుకున్నాడు. 1942 లో బసవతారకం అనే మేన మరదలును పెళ్లి చేసుకున్నాడు. నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నాటక సంస్థను నిర్మించాడు. ఎన్టీఆర్ కు 11 మంది సంతానం, ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. ఎన్టీఆర్ మొదట సబ్ రిజిస్ట్రార్ గా పని చేశాడు. ఆ తర్వాత పల్లెటూరి పిల్ల సినిమాలో అవకాశం రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఎన్టీఆర్ 1985 లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనమండలిని రద్దు చేశాడు. తెలుగుదేశం తొమ్మిదినెలల కాలంలో అధికారంలోకి వచ్చినపుడు టీడీపీ199 ఎమ్మెల్యే సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ ట్యాంకుబండ్ పై చిత్రకారులు, కళాకారులు, తదితర ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పారు. దానవీరశూర కర్ణ, రాముడు భీముడు, గులేబాకావళి కథ, మాయబజార్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలే తెలుగు చలనచిత్ర రంగానికి ఊపిరిపోశాయి. అందుకే ఎవర్ గ్రీన్ ఎన్టీఆర్ నిజంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడే.

TAGS