JAISW News Telugu

Big B Amitabh : నేడు బిగ్ బీ అమితాబ్ పుట్టిన రోజు

Big B Amitabh

Big B Amitabh

Big B Amitabh : నేడు బిగ్ బీ అమితాబ్ పుట్టిన రోజు. అక్టోబరు 11, 1942న ఆయన జన్మించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా బాలీవుడ్ ను ఏలిన నటుడు అమితాబ్ బచ్చన్. ఆయన 1969లో ‘భువన్ షోమ్’ అనే సినిమాతో మొదటిసారి పరిచయం అయ్యారు. మృణాల్ సేన్ తీసిన ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. నటుడిగా మాత్రం సాత్ హిందుస్తానీ ఆయన మొదటి సినిమా. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏడుగురు ప్రధాన పాత్రల్లో ఒకరిగా అమితాబ్ చేశారు. అంతేగాకుండా ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఫుల్ పాపులారిటీ ఉంది. ఆయన సినిమాలే కాకుండా పలు రియాలిటీ షూస్ కు హోస్ట్ గా కూడా వ్యవహరించారు. 1984లో అమితాబ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తమ ఫ్యామిలీ ఫ్రెండ్ రాజీవ్ గాంధీకి మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం హెచ్.ఎన్.బహుగుణకు వ్యతిరేకంగా అలహాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా 68.2 శాతం ఆధిక్యంతో అమితాబ్ గెలిచారు. కానీ ఆయన మూడేళ్లకే తన పదవికి రాజీనామా చేశారు.

82 ఏళ్ల వయస్సులో కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.ప్రస్తుతం పలు చిత్రాల్లో గెస్ట్ రోల్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల కల్కీతో హిట్ అందుకున్న బిగ్ బీ ‘వెట్టయాన్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Exit mobile version