Today Horoscopes : నేటి రాశి ఫలాలు
Today Horoscopes :మేష రాశి వారికి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. ఎదుటి వారి మనసు దోచుకుంటారు. ఇష్టదేవతారాధన మంచిది.
వ్రషభ రాశి వారికి కొన్ని పనులు విచారం కలిగిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. చేపట్టే పనుల్లో సహకారాలు లభిస్తాయి. గణపతి స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మిథున రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో లాభాలున్నాయి. అనుకూల కాలం. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవరాధన చేయడం ఉత్తమం.
కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటుతో వెళ్లకూడదు. పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. దుర్గాదేవిని కొలవడం శుభకరం.
సింహ రాశి వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి.ఇష్టదేవతారాధన మేలు కలిగిస్తుంది.
కన్య రాశి వారికి మానసిక ప్రశాంతత తగ్గుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి. లలితా సహస్ర నామాలు చదువుకోవడం శుభప్రదం.
తుల రాశి వారికి ఉత్సాహంతో ముందుకు వెళతారు. ఒక శుభవార్త మీలో సంతోషం నింపుతుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం శ్రేయస్కరం.
వ్రశ్చిక రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సమయానికి సాయం చేసే వారుంటారు. శుభవార్తలు వింటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం సంతోషం కలిగిస్తుంది.
ధనస్సు రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది. కొన్ని సంఘటనలు కష్టాలు తెచ్చిపెడతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లండి. విష్ణు నామస్మరణ సురక్షితం.
మకర రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సహనం కోల్పోవద్దు. శ్రమ పెరుగుతుంది. లక్ష్మీ సహస్ర నామాలు పారాయణం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది.
కుంభ రాశి వారికి గొడవలు వచ్చే అవకాశముంది. శ్రమ పెరుగుతుంది. అందరిని కలుపుకుని పోవడం ఉత్తమం. గణేష అష్టోత్తర శతనామావళి చదవడంతో సమస్యలు తీరుతాయి.
మీన రాశి వారికి మీ ప్రతిభకు అధికారులు ప్రశంసలు కురిపిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయ స్తోత్రం చదవడం బాగుంటుంది.