మేష రాశి వారికి కొన్ని సంఘటనలు బాధిస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. కొన్ని విషయాల్లో ఏకాగ్రత దెబ్బ తింటుంది. ఈశ్వర నామ స్మరణ మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రషభ రాశి వారికి శుభ కార్యాల్లో పాల్గొంటారు. మీ శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. సూర్యుడిని పూజించడం మేలు కలిగిస్తుంది.
మిథున రాశి వారికి విందు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలున్నాయి. విష్ణు ఆరాధన శుభ ఫలితాలు ఇస్తుంది.
కర్కాటక రాశి వారికి పనుల్లో అలసట ఉంటుంది. ఇతరుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ప్రోత్సాహకాలు దక్కుతాయి. వెంకటేశ్వర ఆరాధన మంచిది.
సింహ రాశి వారికి ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాచారం సరిగా తెలుసుకోవాలి. ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కన్య రాశి వారికి అధికారులను మచ్చిక చేసుకుంటారు. దీంతో భవిష్యత్ బాగుంటుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. దుర్గా అష్టోత్తరం చదవడం మేలు చేస్తుంది.
తుల రాశి వారికి అనవసర ఖర్చులుంటాయి జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మనోబలం పెరుగుతుంది. గణపతి స్తోత్రం చదవడం శుభకరం.
వ్రశ్చిక రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సానుకూల ఫలితాలు వస్తాయి. శ్రీ లక్ష్మీ దర్శనం అనుకూల ఫలితాలు ఇస్తుంది.
ధనస్సు రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవతా స్తోత్రం శుభాలు కలిగిస్తుంది.
మకర రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
కుంభ రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయాలు దక్కుతాయి. శ్రీలక్ష్మీ ధ్యానం చేయడం మేలు.
మీన రాశి వారికి ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఇష్టదైవాన్ని జపించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి.