Today Horoscopes : నేటి రాశి ఫలాలు

Today Horoscopes 9th February

Today Horoscopes 9th February

Today Horoscopes 9th February : మేష రాశి వారికి కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది. అనవసర ఆలోచనలు పెట్టుకోవద్దు. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది.

వ్రషభ రాశి వారికి పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.  ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇతరుల సాయంతో పనుల్లో వేగం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది.

మిథున రాశి వారికి గొడవలకు దూరంగా ఉండాలి. ముందుచూపుతో ఉండాలి. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. ఇష్టదేవతారాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.

కర్కాటక రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. మనోధైర్యంతో ముందుకు వెళతారు. విష్ణు సహస్ర నామాలు చదవడం మంచిది.

సింహ రాశి వారికి ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతను ఆరాధించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి వారికి అవసరానికి డబ్బు దొరుకుతుంది. ఇతరుల సాయం అందుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్యుడిని పూజించడం శ్రేయస్కరం.

తుల రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. గణపతి స్తోత్రం చదవడం మేలు కలిగిస్తుంది.

వ్రశ్చిక రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. లక్ష్మీ దర్శనం శుభప్రదం.

ధనస్సు రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

మకర రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వార్త విచారం కలిగిస్తుంది. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మేలు.

కుంభ రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి వారికి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోండి. అధికారుల అండ ఉంటుంది. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడం శ్రేయోదాయకం.

TAGS