Today Horoscopes : నేటి రాశి ఫలాలు
Today Horoscopes : మేష రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు రావచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సందేహాలు వద్దు. దుర్గాదేవి శ్లోకం చదవడం వల్ల అన్ని మంచి ఫలితాలు వస్తాయి.
వ్రషభ రాశి వారికి నూతన వస్తువులు సేకరిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మేలు కలుగుతుంది.
మిథున రాశి వారికి ఉల్లాసం పెరుగుతుంది. మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. గణపతి స్తోత్రం చదివితే అనుకూల ఫలితాలు వస్తాయి.
సింహ రాశి వారికి మీ ధర్మ మార్గమే మీకు రక్షణగా ఉంటుంది. బాగా ఆలోచించి పనులు పూర్తి చేస్తారు. ఆంజనేయ స్వామి దర్శనం శుభాలు తెస్తుంది.
కన్య రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
తుల రాశి వారికి ఒక సమస్య మీ ధైర్యాన్ని దెబ్బ తీస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
వ్రశ్చిక రాశి వారికి ఒక శుభవార్త మీకు సంతోషం కలిగిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. చేపట్టే పనులు పూర్తి చేస్తారు. దైవారాధన చేయడం సురక్షితం.
ధనస్సు రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. చంద్రధ్యానం అనుకూలతలు కలిగిస్తుంది.
మకర రాశి వారికి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టే పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సూర్య భగవానుడిని కొలవడం మేలు.
కుంభ రాశి వారికి వ్యాపారంలో లాభాలుంటాయి. ఆపద కాలంలో సాయం చేసేవారుంటారు. శివారాధన చేయడం వల్ల మంచి లాభాలుంటాయి.
మీన రాశి వారికి నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందరిని కలుపుకుని పోవడం ఉత్తమం. ఈశ్వర ధ్యానం మంచిది.