Today Horoscopes : నేటి రాశి ఫలాలు

Today Horoscopes

Today Horoscopes

Today Horoscopes 7th February : మేష రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఉత్సాహంతో పనిచేసి లక్ష్యం చేరుకుంటారు. గుడ్డిగా అందరిని నమ్మొద్దు. శ్రీరామనామం జపించడం వల్ల మేలు కలుగుతుంది.

వ్రషభ రాశి వారికి ఖర్చులు మీరకుండా చూసుకోవాలి. అనుకున్న పనులు నెరవేరే వరకు విశ్రమించొద్దు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది.

మిథున రాశి వారికి ఆర్థికంగా బలంగా ఉంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి కాలం. శత్రువులపై విజయం మీదే అవుతుంది. ఆంజనేయ స్వామి దర్శనం శుభకరం.

కర్కాటక రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. లక్ష్మీ ధ్యానం చేయడం ఉత్తమం.

సింహ రాశి ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేధావుల సలహాలు తీసుకుంటే మంచిది. విష్ణు మూర్తిని ధ్యానించడం శుభప్రదం.

కన్య రాశి వారికి సకాలంలో పనులు పూర్తి చేసుకుంటారు. మంచి ఫలితాలు సాధిస్తారు. కొందరి సలహాలు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. సూర్యుడిని కొలవడం మంచిది.

తుల రాశి వారికి ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న రంగంలో ఉన్నతి అందుకుంటారు. శివారాధన విజయం కలిగిస్తుంది.

వ్రశ్చిక రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త. మనోధైర్యంతో ఉంటారు. అప్పులు తిప్పలు పెడతాయి. అనవసర ఖర్చులు వేధిస్తాయి. రుణ విమోచన అంగాకర స్తోత్రం చదువుకోవడం మేలు.

ధనస్సు రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా పోతాయి. మీ టాలెంట్ కు ప్రశంసలు దక్కుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి పూజించడం శ్రేయస్కరం.

మకర రాశి వారికి వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. ప్రణాళికతో ముందుకు వెళ్లండి. సూర్యుడిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.

కుంభ రాశి వారికి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పనులు త్వరగా పూర్తవుతాయి. పెద్దల సహకారం తీసుకుంటే మంచిది. శివారాధన శుభాలు కలిగిస్తుంది.

మీన రాశి వారికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గణపతి ఆరాధన ఇంకా మంచి ఫలితాల రావడానికి కారణమవుతుంది.

TAGS