Today Horoscopes : నేటి రాశి ఫలాలు

Today Horoscopes

Today Horoscopes

Today Horoscopes 31st January : మేష రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. కొన్ని సంఘటనలు బాధిస్తాయి. కనకధారాస్తవం మంచిది.

వ్రషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం శుభకరం.

మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. శ్రమ పెరుగుతుంది. వాగ్వాదాలకు దిగడం మంచిది కాదు. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విష్ణు సహస్ర నామం చదువుకోవడం ఉత్తమం.

సింహ రాశి వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. మానసికంగా బలంగా ఉంటారు. ఆంజనేయ దర్శనం శుభ ఫలితాలు కలిగిస్తుంది.

కన్య రాశి వారికి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టే పనుల్లో మంచి ఫలితాలుంటాయి. విష్ణు సహస్ర నామాలు చదువుకోవడం మేలు కలిగిస్తుంది.

తుల రాశి వారికి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కీలకనిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువడం శ్రేయస్కరం.

వ్రశ్చిక రాశి వారికి ఉత్సాహంగా ఉంటారు. చేపట్టే పనుల్లో జాగ్రత్తలు పాటించాలి. బంధువుల సహకారం ఉంటుంది. లక్ష్మీ సహస్ర నామం చదవడం మంచిది.

ధనస్సు రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి. అందరి గుర్తింపు లభిస్తుంది. మంచి కాలం. ఇతరుల సహాయం దక్కుతుంది. గణపతి ఆరాధన సురక్షితం.

మకర రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆదర్శంగా నిలుస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సూర్య నారాయణ మూర్తిని పూజించడం శుభదాయకం.

కుంభ రాశి వారికి కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. అకారణంగా గొడవలు వచ్చే అవకాశముంది. అనుకున్నది సాధిస్తారు. ఇష్టదైవాన్ని ఆరాధించడం మంచిది.

మీన రాశి వారికి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. చేపట్టే పనుల్లో విజయాలు దక్కుతాయి. శ్రీరామ నామం జపించడం మేలు చేస్తుంది.

TAGS