Today Horoscopes : మేష రాశి వారికి శత్రువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మనోధైర్యంతో ముందుకు వెళతారు. అనవసరంగా ఆందోళన వద్దు. దైవారాధన చేయడం మంచిది.
వ్రషభ రాశి వారికి కొన్ని సంఘటనలు సంతోషం కలిగిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. దైవారాధన అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి వారికి ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కనకధారాస్తవం చదవడం మేలు కలుగుతుంది.
కర్కాటక రాశి వారికి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో వ్యవహరించాలి. శివారాధన చేయడం శుభకరం.
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టే పనుల్లో విజయాలు దక్కుతాయి. సంతోషంగా గడుపుతారు. ఆంజనేయస్వామిని పూజించడం శుభప్రదం.
కన్య రాశి వారికి కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. గణపతి ఆరాధన శ్రేయస్కరం.
తుల రాశి వారికి వ్యాపారాల్లో లాభాలుంటాయి. పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. విష్ణు దర్శనం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. శ్రీరామ నామం జపించడం ఉత్తమ ఫలితాలు తెస్తుంది.
ధనస్సు రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒత్తిడిని తట్టుకునేందుకు ఇబ్బందులు పడతారు. హనుమాన్ చాలీసా చదవడం మేలు కలుగుతుంది.
మకర రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక అవసరాలు తీరుతాయి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. శని శ్లోకం చదవడం వల్ల బాగుంటుంది.
కుంభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాతావరణం అనుకూలంగా అనిపిస్తుంది. దుర్గాస్తుతి చేసుకోవడం వల్ల శ్రేయోదాయకం.
మీన రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. విజయాలు దక్కుతాయి. దైవబలం రక్షిస్తుంది. ఇష్టదేవతా దర్శనం శుభకరం.