JAISW News Telugu

Today Horoscopes : నేటి రాశి ఫలాలు

Today Horoscopes 25th January

Today Horoscopes 25th January

Today Horoscopes 25th January : మేష రాశి వారికి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. కీలక సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. సూర్యారాధన చేయడం ఉత్తమం.

వ్రషభ రాశి వారికి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆచితూచి మాట్లాడాలి. దైవారాధన చేయడం మంచి ఫలితాలు కలిగిస్తుంది.

మిథున రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మనోబలంతో ముందడుగు వేస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.

కర్కాటక రాశి వారికి నిర్ణయాలు మార్చుకుంటే కష్టాలు ఎదురవుతాయి. మంచి ఆలోచనలతో ముందుకెళితే ఫలితాలు బాగుంటాయి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి వారికి అధికారుల అండ ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. నలుగురిలో గౌరవం దక్కుతుంది. ఈశ్వర దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

కన్య రాశి వారికి ఒక శుభవార్త మీలో సంతోషం పెంచుతుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన బాగుంటుంది.

తుల రాశి వారికి రుణ సమస్యలు తొలగించుకోవాలి. ఆఛితూచి వ్యవహరించాలి. చేపట్టే పనులు పూర్తి చేస్తారు. ఇష్టదేవతారాధన చేయడం మేలు కలిగిస్తుంది.

వ్రశ్చిక రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. స్థాన చలన సూచనలున్నాయి. శ్రీహరిని ఆరాధించడం శ్రేయోదాయకం.

ధనస్సు రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.

మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ ఉండాలి. లలితా సహస్ర నామాలు చదవడం వల్ల అనుకూలత ఉంటుంది.

కుంభ రాశి వారికి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. మనోబలంతో ముందడుగు వేస్తారు. గణపతి స్తోత్రం చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి వారికి ఆర్థిక లాభాలుంటాయి. శ్రమతో విజయాలు దక్కుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఇష్టదేవతారాధన మంచిది.

Exit mobile version