Today Horoscopes : నేటి రాశి ఫలాలు

Today Horoscopes

Today Horoscopes

Today Horoscopes : మేష రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆంజనేయ స్వామిని పూజించడం శుభకరం.

వ్రషభ రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు. మనోబలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

మిథున రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలుంటాయి. సంతోషంగా ఉంటారు. సూర్య నమస్కారం మంచి ఫలితాలు ఇస్తుంది.

కర్కాటక రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రశాంతంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభాలు కలిగిస్తుంది.

సింహ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి. దైవబలం కలిసొస్తుంది. మంచి ఫలితాలుంటాయి. లక్ష్మీదేవి దర్శనం మేలు కలిగిస్తుంది.

కన్య రాశి వారికి మానసిక సంతోషం కలుగుతుంది. మంచి పనులు చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. గురు ధ్యానం చేయడం ఉత్తమం.

తుల రాశి వారికి శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. కీలక విషయాల్లో సలహాలు తీసుకుంటారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం శ్రేయస్కరం.

వ్రశ్చిక రాశి వారికి ఒత్తిడి రానీయొద్దు. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. నవగ్రహ శ్లోకాలు చదవడం శుభకరం.

ధనస్సు రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మానసికంగా బలంగా ఉంటారు. అధికారంలో మంచి ఫలితాలుంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మేలు.

మకర రాశి వారికి మనోబలంతో ముందుకు వెళతారు. చేపట్టే పనుల్లో విజయాలు దక్కుతాయి. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి వారికి సమయానికి సాయం చేసేవారుంటారు. కీలక విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం శ్రేయస్కరం.

మీన రాశి వారికి శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి పనిచేస్తే పనులు పూర్తవుతాయి. నవగ్రహ శ్లోకం చదవడం శ్రేయోదాయకం.

TAGS