Today Horoscopes : నేటి రాశి ఫలాలు
వ్రషభ రాశి వారికి కొన్ని విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. రామ భుజంగ స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. రామనామస్మరణ శ్రేయస్కరం.
కర్కాటక రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. దైవబలం అండగా నిలుస్తుంది. రామ దర్శనం శుభప్రదం.
సింహ రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అనవసరంగా కష్టాల పాలు కావద్దు. అనుకున్నది సాధిస్తారు. రామరక్ష స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కన్య రాశి వారికి భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. పనులు వాయిదా వేయొద్దు. సమస్యలను అధిగమిస్తారు. శ్రీరాముడిని ఆరాధించడం మేలు.
తుల రాశి వారికి శుభ ఫలితాలు అందుకుంటారు. పట్టుదలతో ముందడుగు వేస్తారు. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. రామదర్శనం అనుకూలంగా ఉంటుంది.
వ్రశ్చిక రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మనోవిచారం కలిగించే సంఘటనలున్నాయి. రామనామం జపించడం మంచిది.
ధనస్సు రాశి వారికి మంచి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం దక్కుతుంది. రాముడి దర్శనం లాభాలు కలిగిస్తుంది.
మకర రాశి వారికి ఉత్సాహంతో పనిచేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు తీసుకునే ఆలోచనలే మీకు మచి ఫలితాలు ఇస్తాయి. రాముడి దర్శనం శ్రేయస్కరం.
కుంభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. రాముడి ఆరాధన గొప్ప ఫలితాలు ఇస్తుంది.
మీన రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. చేపట్టే పనుల్లో పురోగమనం ఉంటుంది. ఇది సరైన సమయం. శ్రీరామ స్తోత్రం చదవడం అన్ని విధాలా బాగుంటుంది.