Today Horoscopes : నేటి రాశి ఫలాలు

Today Horoscopes

Today Horoscopes

Today Horoscopes : మేష రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. బాధ్యతలు సమర్థంగా పూర్తి చేస్తారు. చేపట్టే పనుల్లో వేగం ఉంటుంది. లింగాష్టకం చదవడం ఉత్తమం.

వ్రషభ రాశి వారికి గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చేసే పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు వ్యతిరేకంగా ఉండొచ్చు. నవగ్రహ శ్లోకం చదువుకోవడం మేలు.

మిథున రాశి వారికి మీ ధర్మమే మీకు అండగా నిలుస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సూర్యాష్టకం చదివితే మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటక రాశి వారికి సొంతింటి పనులు చక్కబెడతారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు అడుగులు వేస్తారు. సూర్యుడిని కొలవడం శుభకరం.

సింహ రాశి వారికి కీలక పనులను వాయిదా వేయకండి. నిపుణుల సలహాలు తీసుకోండి. పనుల్లో అలసట అనిపిస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం బాగుంటుంది.

కన్య రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పనుల్లో ఆటంకాలు ఎదురు కావు. ఆర్థిక లాభాలున్నాయి. లక్ష్మీ దర్శనం మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.

తుల రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దుర్గాధ్యానం చేయడం శ్రేయస్కరం.

వ్రశ్చిక రాశి వారికి అధికారుల అండ ఉంటుంది. పనులు త్వరా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సూర్యుడిని పూజించడం శుభకరం.

ధనస్సు రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. శత్రువులను తక్కువగా చూడొద్దు. అవసరానికి తగిన సాయం చేసే వారుంటారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

మకర రాశి వారికి పెద్దల సహకారంతో మంచి ఫలితాలు అందుకుంటారు. దైవబలంలో ముందడుగు వేస్తారు. శనిధ్యానం చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.

కుంభ రాశి వారికి అవసరానికి డబ్బు అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్నపనులు సమయానికి పూర్తి చేస్తారు. శని శ్లోకం చదువుకోవడం మంచిది.

మీన రాశి వారికి ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. అధికారుల అండ ఉంటుంది. పెద్దల ఆశీస్సులుంటాయి. హనుమాన్ చాలీసా చదువుకోవడం క్షేమం.

TAGS