Today Horoscope : నేటి రాశి ఫలాలు

Today Horoscope
Today Horoscope : మేష రాశి వారికి అధికారుల అండతో పనులు పూర్తి చేస్తారు. పనులు చాకచక్యంగా ముందుకు నడిపిస్తారు. సూర్యుడిని ఆరాధించడం మంచిది.
వ్రషభ రాశి వారికి గొడవలకు దూరంగా ఉండాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాల్లో అప్రమత్తంగా మసలుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ఉత్తమం.
మిథున రాశి ఆర్థిక లాభాలుంటాయి. పనులు సమర్థంగా నిర్వహిస్తారు. చేపట్టే పనులు తొందరగా పూర్తి చేస్తారు. లింగాష్టకం చదవడం శ్రేయస్కరం.
కర్కాటక రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవిని కొలవడం వల్ల మంచి లాభాలుంటాయి.
సింహ రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. సొంతింటి నిర్మాణంపై ఆలోచనలు చేస్తారు. సూర్య భగవానుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
కన్య రాశి వారికి పెద్దవారిని కలిసి అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది. ఈశ్వర దర్శనం అనుకూలతలు కలగజేస్తుంది.
తుల రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో లాభాలుంటాయి. దైవారాధన బాగుంటుంది.
వ్రశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. దుర్గాధ్యానం చేయడం మేలు కలిగిస్తుంది.
ధనస్సు రాశి వారికి శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దు. అవసరానికి తగిన సాయం దొరుకుతుంది. మానసికంగా బలంగా ఉంటారు. హనుమాన్ చాలీసా చదవడం మేలు.
మకర రాశి వారికి ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. అలసట ఎక్కువవుతుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదవడం శ్రేయోదాయకం.
కుంభ రాశి వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. శని శ్లోకం చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. శని శ్లోకం చదవడం శుభప్రదం.
మీన రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విందు వినోదాల్లో చురుకుగా ఉంటారు. శని శ్లోకం చదివితే మంచిది.