Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం పిఠాపురం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఎన్నికల్లో రెండు స్థానల్లో నిలబడి భంగపడ్డ పవన్ ఈ సారి ఒకే ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు పవన్ అండ్ కో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పిఠాపురంలో పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉంది.
ఇప్పుడు జనసేన నేతలు కొత్త కథనాన్ని తెరపైకి తెచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు అధికార వైసీపీ పెద్ద ప్లాన్ వేసిందని, అందులో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి రూ.10వేలు ఇస్తున్నారనే టాక్ వస్తుంది. హార్డ్ కోర్ జనసేన మద్దతుదారుల ఇళ్లు మినహా మిగిలిన ఇళ్లలో డబ్బులు పంచుతున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు.
అయితే వ్యూహాత్మకంగా ఈ వాదనను తెరపైకి తెస్తున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.10వేలు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైతే ఆ వీడియోలు సోషల్ మీడియాలో చూసేవాళ్లం. అలాంటి సీన్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ పై సానుభూతి పెంచేందుకే ఈ కథనం అని జనాలు అనుకుంటున్నారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టేందుకే ఈ కథనాన్ని తెరపైకి తెచ్చారని మండిపడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో ఇంటికి రూ.10వేలు పంపిణీ చేయడం అంత సులువు కాదు. ఈ సీన్ ఇలా ఉంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాకపోతే విజువల్స్ మొత్తం సోషల్ మీడియాలో ఉండేవి. అధికార పార్టీని టార్గెట్ చేసే ఏ అవకాశాన్నీ వదులుకోని పవన్ మద్దతుదారులు ఇలా తమ పార్టీపై నెగెటివ్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బు పంపిణీ ఆరోపణలు పవన్ కు పాజిటివ్ ఓటింగ్ పెంచేందుకే ప్లాన్ చేసి కావచ్చని అంటున్నారు.