YS Sharmila : తిరుమల లడ్డూను జగన్ సర్కారు కల్తీ చేసింది : వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila

YS Sharmila : జగన్ సర్కారు తిరుమల లడ్డూను కల్తీ చేసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. లడ్డూలకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్ లో నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. మళ్లీ తప్పు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఈ అంశంపై పీసీసీ అధ్యక్షురాలిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాసినట్లు తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె స్పందించారు. డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందన్నారు. ‘‘రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

TAGS