Tirumala Laddu controversy : తిరుమల లడ్డూ వివాదం.. సెప్టెంబరు 30న పిటిషన్లపై విచారణ

Tirumala Laddu controversy
Tirumala Laddu controversy : తిరుమల లడ్డూ వివాదం ఏపీలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ అంశంపై ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్యణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం (సెప్టెంబరు 30) సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
తిరుమల లడ్డూ అంశంపై విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సెట్ ఏర్పాటు చేయగా, ప్రతిపక్ష వైసీపీ సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తోంది. వైసీపీని టార్గెట్ చేస్తూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కాస్తా దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు భంగం కలిగించడంతో జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.