Tirumala Laddu controversy : తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో కేసు విచారణ రేపటికి వాయిదా

Tirumala Laddu controversy Supreme Court
Tirumala Laddu controversy : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది. ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉన్నందున ఇవాళ జరగాల్సిన విచారణ రేపటికా వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు.
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్) కొనసాగించాలా..? లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా..? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన విచారణ శుక్రవారానికి వాయిదాపడింది.