Tinmar Mallanna : అక్కినేని నాగార్జునపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయడంపై మల్లన్న స్పందించారు. నాగార్జున నువ్వు, ఒక మహిళా మంత్రిపై కాలు దువ్వుతున్నావు కదా? ఒక్క బీసీ మహిళా మంత్రి ఉంటే మీరంతా కలిసి ఆమెను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తాం అది కూడా అని అన్నారు. ఎన్ కన్వెన్షన్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మల్లన్న ప్రస్తావిస్తూ ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తే, ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
మరోవైపు నాగార్జున నాంపల్లి కోర్టులో వేసిన పరువు నష్టం పిటిషన్ వాయిదాపడినట్లు సమాచారం. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.