JAISW News Telugu

Andhra Pradesh:ఏపీలో మ‌ళ్లీ ఫ్యాన్‌కే ప‌ట్టం?..క‌నిపించ‌ని టీడీపీ జోరు

Andhra Pradesh:తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. త్వ‌ర‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ ఫ‌లితాల‌ని దృష్టిలో పెట్టుకుని ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ జాగ్ర‌త్త ప‌డుతోంది. గెలుపు గుర్రాల‌కే సీట్లు కేటాయించాల‌ని ప‌లు నియోజ‌క వ‌ర్గాల్లో భారీ మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలోనూ తెలంగాణ ఫ‌లితాలే పున‌రావృతం అవుతాయ‌ని ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయం ఊపందుకుంది.

అయితే ఇందుకు పూర్తి భిన్నంగా ప్ర‌ముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈజీటీ (Times Now ETG Survey ) స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాల్ని వెల్ల‌డించింది. ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వైఎస్సార్‌సీపీ ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం ఖాయం అని త‌న స‌ర్వేలో వెల్ల‌డించింది. రాష్ట్రంలోని 25 లోక్‌స‌భ స్థానాల్లో 24- 25 సీట్ల‌ను ఆ పార్టీ చేజ‌క్కించుకుంటుంద‌ని ప్ర‌క‌టించింది. అయితే టీడీపీ మాత్రం ఒకే ఒక్క స్థానంలో ఉన‌కి చాటుకునే అవ‌కాశం ఉంద‌ని తెలప‌డం ప‌లువురిని షాక్‌కు గురి చేస్తోంది.

అంతే కాకుండా టీడీపీ మిత్రప‌క్ష‌మైన జ‌న‌సేన అస‌లు ఖాతానే తెర‌వ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. టైమ్స్‌నౌ ఈటీజీ ఫ‌లితాల‌ను టైమ్స్ నౌ ఛాన‌ల్ బుధ‌వారం రాత్రి ప్ర‌సారం చేసింది. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ 19 స్థానాల‌ని ద‌క్కించుకుంద‌ని, అయితే ఈ సారి మ‌రింత‌గా పుంజుకుని 24 నుంచి 25 లోక్‌స‌భ స్థానాల‌ని ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని తెలిపింది. గ‌డిచిన ఐదేళ్ల కాలంగా సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సంక్షేమ ప‌థ‌కాల‌తో వైఎస్సార్‌సీపీకి ప్ర‌జాద‌ర‌ణ పెరిగింద‌ని, అందుకే ఆ పార్టీ 22 లోక్‌స‌భ స్థానాల నుంచి 25 లోక్‌స‌భ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని తన స‌ర్వేలో పేర్కొంది.

ఇక ఇదే స‌మ‌యంలో బీజేపీ మాత్రం ఒక్క స్థానాన్ని కూడా ద‌క్కించుకునే అవ‌కాశం లేద‌ని, ఆ పార్టీ ఏపీలో పెద్ద‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేసింది. గ‌త ఏన్నిక‌ల్లో ప్ర‌ధాన పా్టీ ఓట్ షేరింగ్ గురించి కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌సీపీ 50 శాతం, ట‌డీపీ 37 శాతం, జ‌న‌సేన 10 శాతం, బీజేపీ 1 శాతం మాత్ర‌మే ఓట్ల‌ని షేర్ చేసుకున్నాయ‌ని అయితే వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం వైఎస్సార్‌సీపీ పార్టీనే క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది మ‌రి టైమ్స్ నౌ స‌ర్వే ఏపీలో జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంత వ‌ర‌కు నిమౌతుందో వేచి చూడాల్సిందే. ఈ స‌ర్వేపై టీడీపీ వ‌ర్గాలు పెద‌వి విరుస్తున్నాయి.

Exit mobile version