Pawan Kalyan : కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. దీనికే పవన్ కళ్యాణ్ సాక్ష్యం

Pawan Kalyan
Pawan Kalyan : కాలం అందరి సరదా తీర్చేస్తుంది.. ఒకప్పుడు ఏపీలో పర్యటించడానికే అనేక ఆంక్షలు ఉండేవి పవన్ కళ్యాణ్ కు.. విశాఖలో అయితే పవన్ ను నిర్బంధించి అక్కడి నుంచి విశాఖకు పంపించేశారు. ఇక అమరావతిలో అడ్డుకున్నారు. పవన్ ఎక్కడికి వెళ్లినా సరే అడుగడుగునా పోలీస్ పహారాతో జగన్ సర్కార్ అడ్డుకునేవారు..
పోలీసులు అడ్డుకోవడంతో ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ రాత్రి పూట విజయవాడకు దగ్గర్లో రోడ్డుమీదే పడుకొని నిరసన తెలిపాడు. అంతలా పవన్ ను పోలీసులు హింసించారు.
కానీ నవ్విన నాపచేసే పండుతుంది అన్నట్టుగా గాయపడ్డ పవన్ ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం. ఆయన ఎక్కడికి వెళ్లినా వై ప్లస్ సెక్యూరిటీ.. ఏ పోలీసులు అయితే పవన్ ను నడిరోడ్డుపై అడ్డుకొని పడుకోబెట్టారో వారిచేతనే సెల్యూట్ చేయించుకున్నాడు.
అందుకే అంటారు ‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు’ అని.. దానికి పవన్ కళ్యాణ్ నే సాక్ష్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.