Tilak Verma : సౌతాఫ్రికా తో జరిగిన మూడో టి20 మ్యాచ్లో భారత్ ఉత్కంఠ పోరులో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్లో ఎప్పటిలాగా సూర్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రాకుండా తిలక్ వర్మను పంపించాడు. ఓపెనర్ గా సంజు సామ్సన్ మరోసారి డక్ అవుట్ అయి వెనుతిరగగా మూడో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ కు వచ్చాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనక పెద్ద ప్లాన్ ఉందని మ్యాచ్ తర్వాత సూర్య మాటల్లో అర్థమైంది.
రెండో టి20లో ఓడిపోయిన తర్వాత తిలక్ వర్మ సూర్య కుమార్ యాదవ్ రూమ్ కు వెళ్లి నేను మూడో టి20 లో వన్ డౌన్ బ్యాటింగ్ కు వెళతాను ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు.దీంతో మూడో టి20 లో సూర్య కుమార్ యాదవ్ తిలక్ వర్మకు మూడో ప్లేస్ లో బ్యాటింగ్ చేసేందుకు ఛాన్స్ ఇచ్చాడు. దీంతో తిలక్ వర్మ 56 బంతుల్లోనే 107 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ సెంచరీ సాధించడం గొప్ప విషయంగా భావిస్తున్నారు.
సూర్య మాట్లాడుతూ తిలక్ వర్మ చాలా గొప్పగా ఆడాడు. నా రూమ్ కి వచ్చి నన్ను అడిగాడు.మూడో స్థానంలో బ్యాటింగ్ ఇవ్వమని ఛాన్స్ ఇస్తే ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడని ప్రశంసలు కురిపించాడు. తిలక్ వర్మ మాట్లాడుతూ భారత్ కు ఆడడం నా కల అది నెరవేరడంతో పాటు సెంచరీ చేయడం కూడా మరో కలగా అది కూడా ఈరోజు నెరవేరింది. సెంచరీ కంటే ముఖ్యం భారత్ గెలవడమే అని తిలక్ వర్మ అన్నాడు. హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ ఇలా బ్యాటింగ్లో రాణించడంతో తెలుగు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇలాగే కంటిన్యూగా రాణిస్తూ భారత జట్టులో స్థానాన్ని సృష్టిరం చేసుకోవాలని కోరుతున్నారు.